Ali Khamenei: మహిళలు సున్నితమైన పువ్వులు ... ఇరాన్ నేత ట్వీట్ ! 3 d ago
ఇరాన్ సర్వ్వోన్నత నేత అయతుల్లా అలీ ఖమేనీ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మహిళలు సున్నితమైన పూలతో సమానం అంటూ ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 'స్త్రీ ఒక సున్నితమైన పుష్పం ఇంట్లో పనిమనిషి కాదు. స్త్రీని పువ్వులా చూసుకుంటూ, దాని తాజాదనం, సువాసన నుంచి కలిగే ప్రయోజనాలను పొందాలి అని రాసుకొచ్చారు. తమ హక్కుల కోసం అనేకమంది మహిళలు పోరాడుతున్న సమయంలో ఇలా పేర్కొనడం గమనార్హం.